: సమైక్యంగా ఉంచకుంటే పార్టీ నుంచి బయటకు వచ్చేస్తామనే ధైర్యముందా?: యనమల
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తామని చెప్పే ధైర్యం ఆ పార్టీ నేతలకు ఉందా? అని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సవాలు విసిరారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విచ్చితికి కారకాలు కాంగ్రెస్, వైఎస్సార్సీపీ లేనన్నారు. జగన్ బెయిలు కోసం, కేసుల మాఫీ కోసం ఢిల్లీ నేతలతో లాలూచీ, బేరసారాలు తప్ప వైఎస్సార్సీపీకి చిత్తశుద్ధి లేదని యనమల ఆరోపించారు.