: అమితాబ్ కు క్షమాపణ చెప్పండి: మోడీ
అమితాబ్ బచ్చన్ స్వరాన్ని మార్చివేసి యూట్యూబ్ లో నకిలీ వీడియోని పెట్టిన వారు ఆయనకు క్షమాపణ చెప్పాలని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కోరారు. ఆ వీడియోలో మోడీని అమితాబ్ పొగుడుతున్నట్లుగా ఉంది. అలాగే ప్రధానమంత్రిగా మోడీ అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తున్నట్లుగా అమితాబ్ స్వరాన్ని మార్చి వీడియో పెట్టారు. దీనిపై అమితాబ్ మండిపడ్డారు. అది నకిలీదని స్పష్టం చేశారు. దీంతో మోడీ కూడా అమితాబ్ కు మద్దతుగా స్వరం కలిపారు. అలా చేసిన వారు వెంటనే క్షమాపణలు కోరాలని సూచించారు.