: పార్లమెంటులో పోతురాజును తలపించిన టీడీపీ ఎంపీ శివప్రసాద్


పార్లమెంటులో టీడీపీ ఎంపీ శివప్రసాద్ లోక్ సభ సభ్యులను అవాక్కయ్యేలా చేశారు. ఒక్క క్షణం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఏం చేయాలో తెలియని స్థితిలోకి సభ్యులందర్నీ నెట్టి రాష్ట్ర విభజనపై ఆలోచించేలా చేశారు. స్వతహాగా సినీ నటుడైన శివప్రసాద్ రోజుకో వేషధారణతో నిరసనలు తెలిపి సభను అలరించారు. అయితే ఈ రోజు నిరసనల్లో తెలంగాణ సంప్రదాయ పండగల్లో పోతురాజు వేషధారి ధరించే చెర్నాకోలను పట్టుకుని, తనను తాను హింసించుకున్నారు. దీంతో సభ మొత్తం అవాక్కయింది. శివప్రసాద్ కొట్టుకోవడాన్ని చూసిన స్పీకర్ కు మాటపడిపోయింది. దీంతో ఈ రోజు 'టాక్ ఆఫ్ ద సభ' టీడీపీ ఎంపీ శివప్రసాద్ అయ్యారు. పార్లమెంటు వాయిదా పడిన అనంతరం మీడియా ముందు కూడా పార్లమెంటు సన్నివేశాన్ని ప్రదర్శించారు. దీంతో మీడియా ప్రతినిధులు అచేతనులయ్యారు.

  • Loading...

More Telugu News