: పగటి వేషగాళ్లలా వీధినాటకాలాడకండి: రాజేంద్రప్రసాద్
కొండా సురేఖ చెప్పిన విషయాలను గమనించాలని వైఎస్సార్ సీపీ నేతలకు టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ తెలిపారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన కొండా సురేఖ చెప్పిన మాటల్ని ఎవరైనా తప్పు పట్టగలరా? అని ప్రశ్నించారు. జగన్ నిలువునా అమ్మేస్తాడని ఆమె చెప్పారని గుర్తు చేశారు. ఆ పార్టీలో చేరిన నేతలకు విలువ లేదని గుర్తించాలని సూచించారు. చంద్రబాబును దెబ్బతీయడానికే తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. 'సోనియాకు ముసుగే జగన్ పార్టీ' అన్నారు. వీరిద్దరూ కలిసే ఈ నాటకాలాడుతున్నారని అన్నారు. విజయమ్మ నాటకాలు మాని వైఎస్సార్ ఏం అడిగారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు మీ దీక్షకు కారణమేంటో ప్రజలకు చెప్పాలని కోరారు. రూపాయి విలువ దిగజారినట్టు కాంగ్రెస్ ప్రతిష్ఠ దిగజారిపోతోందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.