: నాలుగో రోజు నిలిచిన ఎంసెట్ కౌన్సిలింగ్
అనంతపురంలోని జేఎన్టీయూ, పాలిటెక్నిక్ కళాశాలల్లో సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతమైంది. దాని కారణంగా ఎంసెట్ కౌన్సిలింగ్ ఆగిపోయింది. పాలిటెక్నిక్ కళాశాలలకు వెళ్లకుండా జేఎన్టీయూ సిబ్బంది రోడ్డుకడ్డంగా వాహనాలు నిలిపారు. దీంతో కౌన్సిలింగ్ కోసం వచ్చిన విద్యార్ధులు వెనుదిరిగారు. కాగా ఎంసెట్ కౌన్సిలింగ్ కు విద్యార్ధులు ఎక్కడైనా హాజరుకావొచ్చని హైకోర్టు సూచించిన విషయం తెలిసిందే.