: లోక్ సభ రేపటికి వాయిదా
రెండుసార్లు వాయిదా అనంతరం మొదలైన లోక్ సభలో మునుపటి పరిణామాలే కనిపించడంతో సభ రేపటికి వాయిదా పడింది. 11 మంది సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్ తీర్మానంతో సభలో గందరగోళం ఏర్పడింది. సమావేశాలు ముగిసేంతవరకు సస్పెన్షన్ ఆమోదించాలంటూ సభలో మంత్రి కమల్ నాథ్ ప్రవేశపెట్టిన తీర్మానంకు సభ్యులందరూ వ్యతిరేకత వ్యక్తం చేశారు. దాంతో ఉప సభాపతి సభను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.