: హనుమాన్ జంక్షన్ బంద్
సమైక్యాంధ్రకు మద్దతుగా హనుమాన్ జంక్షన్ బందైంది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ రాజకీయ జేఏసీ, ఏపీఎన్జీవోలు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ బంద్ కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, విద్యా, వాణిజ్య సంఘాలు బంద్ కు మద్దతుగా స్వచ్ఛందంగా మూసివేసి రోడ్లపై నిరసన తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, ముక్కలు చేసి తెలుగు జాతిని నాశనం చేయొద్దని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి, కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.