: ఆప్కో చైర్మన్ గా హనుమంతరావు
ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికుల సహకార సంఘం (ఆప్కో) చైర్మన్ గా మురుగుడు హనుమంతరావు నియమితులు కానున్నారు. ఈమేరకు ముఖ్యమంత్రి ఆయనకు పచ్చ జెండా ఊపినట్టు చెబుతున్నారు. సోమవారం ఉదయం హైదరాబాదులోని ఆప్కో కేంద్ర కార్యాలయంలో చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. గుంటూరు జిల్లాకు చెందిన హనుమంతరావు రాష్ట్ర మాజీ మంత్రిగా కూడా పనిచేశారు.