: రఘునాద్ రెడ్డి ఆరోగ్యం ఆందోళన కరం
రాష్ట్ర విభజనను నిరసిస్తూ అనంతపురం జిల్లా పుట్టపర్తిలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. వెంటనే దీక్షను విరమించాలని వైద్యులు సూచించారు. గత నాలుగు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న పల్లె రఘునాథరెడ్డి దీక్షను విరమించేందుకు ససేమిరా అంటున్నారు.