: పార్లమెంట్ సమావేశాలు 5 రోజులు పొడిగింపు
పార్లమెంట్ సమావేశాలను మరో ఐదు రోజుల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఈ రోజు నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రత బిల్లుతోపాటు మరికొన్ని కీలక బిల్లులకు ప్రభుత్వం ఈ సమావేశాలలోనే ఆమోదం పొందాలనుకుంటోంది. కానీ, సమైక్యాంధ్ర, వాద్రా భూ అక్రమాలు తదితర అంశాలతో సభా సమయం హరించుకుపోయింది. దీంతో మరో ఐదు రోజులు పొడిగించాలని ప్రభుత్వ నిర్ణయించింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం సమావేశాలు ఈ నెల 30 వరకు జరగాల్సి ఉంది.