: 'నిర్భయ' కేసులో జువనైల్ బోర్డు తీర్పుకు సుప్రీం అనుమతి
'నిర్భయ' కేసులో మైనర్ బాలుడిపై జువనైల్ బోర్డు జస్టిస్ తీర్పు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. చీఫ్ జస్టిస్ పి.సదాశివం ఆధ్వర్యంలోని బెంచ్ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే విచారణ పూర్తయిన ఈ కేసులో మైనర్ బాలుడిపై 'బాల నేరస్థుడు' అన్న అభియోగం దాఖలవడంతో రెండు రోజుల కిందట బోర్డు తీర్పును 31కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.