: 25న ఢిల్లీ వెళుతున్న టీఆర్ఎస్ అధినేత
ఈ నెల 25న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారు. దాదాపు ఐదు రోజుల పాటు అక్కడే ఉంటారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకే హస్తిన వెళుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సమావేశాల్లో ఆహార భద్రతా బిల్లుకు మద్దతుగా ఓటు వేస్తారా? లేక కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలుస్తారా? అనేది తెలియాల్సి ఉంది.