: లోక్ సభలో కొనసాగుతున్న అదే తీరు..?
లోక్ సభ సమావేశాల్లో అదే తీరు కొనసాగుతోంది. బొగ్గు శాఖలో దస్త్రాల గల్లంతుపై ప్రధాని వివరణ కోసం బీజేపీ సభ్యులు తీవ్రంగా పట్టుబడుతున్నారు. అటు తమ ప్రాంత ప్రయోజనాలు కాపాడాలంటూ కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు నినాదాలు చేస్తున్నారు. ఈ గందరగోళం మధ్య స్పీకర్ మీరాకుమార్ సభను మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా వేశారు. రాజ్యసభ 15 నిమిషాల పాటు వాయిదాపడింది.