: నేటి నుంచి సీమాంధ్ర ఉపాధ్యాయుల సమ్మె
సమైక్యాంధ్రను కోరుతూ నేటినుంచి సీమాంధ్ర ఉపాధ్యాయులు సమ్మెకు దిగుతున్నారు. రాష్ట్ర విభజన ప్రకటనను వెనక్కి తీసుకునేంతవరకు తమ సమ్మె కొనసాగుతుందని వారు తెలిపారు. మరోవైపు సమైక్యాంధ్ర కోసం విశాఖలో ఓడరేవు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. గంగవరం ఓడరేవు వద్ద ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేస్తుండటంతో ఓడరేవు కార్యకలాపాలు నిలిచిపోయాయి.