: ఫుకుషిమాలో లీకులు లేవని ప్రకటించిన జపాన్
2011లో సునామీ దెబ్బకు ధ్వంసమైన ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రంలో ప్రమాదకరమైన అణుధార్మిక జలాలు లీకవడం లేదంటూ టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ప్రకటించింది. అక్కడ మొత్తం 300 వరకు రేడియోధార్మిక నీటి ట్యాంకులు ఉన్నాయి. నాలుగు రోజుల కిందటే ఇక్కడి ఒక ట్యాంకు నుంచి నీరు లీకవుతోందంటూ జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ నీటిని పసిఫిక్ మహా సముద్రంలో కలిపే యోచన ఉన్నట్లు పేర్కొంది. దీంతో టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ తనిఖీలు నిర్వహించి ఇక ఎలాంటి లీకులు లేవని ప్రకటించింది.