: ఇవి ఆవారా గ్రహాలు!


ఆవారాలు అని ఎవరిని అంటాం... ఎవరూ లేకుండా ఉంటూ, ఇష్టారాజ్యంగా తిరుగుతున్న వారిని ఆవారాలుగా మనం చెబుతుంటాం. అలాగే విశ్వంలో కొన్ని గ్రహాలు ఇలా ఆవారాగా తిరుగుతుంటాయట. అందుకే వీటిని ఆవారా గ్రహాలుగా శాస్త్రవేత్తలు చెబుతుంటారు. సహజంగా గ్రహాలు ఏదో ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతుంటాయి. అయితే కొన్ని గ్రహాలు మాత్రం ఏ నక్షత్రం చుట్టూ తిరగకుండా ఇష్టారాజ్యంగా సంచరిస్తుంటాయి. ఇలాంటి గ్రహాల పుట్టుకను శాస్త్రవేత్తలు గుర్తించారు.

స్వీడన్‌`ఫిన్‌లాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు మోనోసెరాస్‌ నక్షత్రాల రాశిలో భూమి నుండి సుమారు 4600 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న రోసెట్టా నెబ్యులా అనే వాయుమేఘాలపై పరిశోధన చేస్తున్న సమయంలో ఒక కొత్త విషయాన్ని గుర్తించారు. ఇప్పటి వరకూ విశ్వంలో అందునా మన పాలపుంతలో ప్రత్యేక నక్షత్రం చుట్టూ తిరగకుండా ఉండే గ్రహాలు సుమారు 20 వేల కోట్ల దాకా ఉన్నాయి. ఇలాంటి గ్రహాలు నిర్దేశించిన నక్షత్రం అంటూ లేకుండా ఇష్టారాజ్యంగా తిరుగుతుంటాయి. ఇలాంటి గ్రహాలను ఆవారా గ్రహాలు (రోగ్‌ ప్లానెట్స్‌) అని పిలిచేవారు. ఇప్పటి వరకూ ఇలా తిరిగే వాటిని ఏదో ఒక గ్రహకుటుంబం నుండి పారిపోయిన గ్రహాలుగా భావిస్తూ వచ్చారు. ఇప్పుడు శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఇలాంటి గ్రహాలు తమకు తామే పుట్టి ఇలా ఇష్టారాజ్యంగా సంచరిస్తున్నట్టు తేలింది. రోసెట్టా నెబ్యూలాలోని కొన్ని గాలి మేఘాలే పక్కనున్న నక్షత్రాల ప్రభావంతో తమకు తాము గ్రహాలుగా మారి అనామకంగా సంచరించడం గమనించినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News