: మీ ఇంటితో మీరు మాట్లాడొచ్చు!


మీరు మీ ఇంటితో మాట్లాడొచ్చు... అవి చెప్పే కబుర్లను ఎంచక్కా మీరూ వినొచ్చు... మీ ఇంటి గోడల కష్టాలు, సంతోషాలను మీరు తెలుసుకుని వాటిని తీర్చేదానికి ప్రయత్నించవచ్చు... ఏంటీ, ఇదంతా వట్టి కబుర్లు అనుకుంటున్నారా... లేదండీ... పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో మాట్లాడే గోడలను శాస్త్రవేత్తలు సృష్టించారు. దీంతో ఇప్పటి వరకూ గోడలకు చెవులు మాత్రమే ఉంటాయి అనుకునేవాళ్లం... ఇకపై గోడలకు నోరుకూడా ఉంటుందని చెప్పుకోవాల్సి ఉంటుంది.

అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మాట్లాడే గోడలను రూపొందించారు. ఒక సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో వీరు ఈ గోడలను తయారు చేశారు. ప్లాస్టిక్‌ షీట్లకు అనుసంధానించగల అత్యంత పలుచని రేడియోల సాయంతో గోడల ద్వారా వినడం, మాట్లాడడం చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వ్యవస్థ ద్వారా కేవలం గోడలు మాత్రమే కాకుండా భవనాలు, వంతెనలు, చివరికి రోడ్లు కూడా మాట్లాడతాయని పరిశోధకులు చెబుతున్నారు. మొదట ఈ విధానంతో ఇంధన పొదుపు స్మార్ట్‌ భవనాలను సృష్టించామని ఈ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భారత సంతతికి చెందిన నవీన్‌ వర్మ తెలిపారు. సౌరశక్తి సాయంతో ఈ మాట్లాడే గోడలకు, రేడియోలకు నిరంతరం స్వయంచాలితంగా విద్యుత్‌ అందేలా చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News