: ఎంపీ పదవికి రేపు హరికృష్ణ రాజీనామా?


టీడీపీ నేత నందమూరి హరికృష్ణ రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖను ఛైర్మన్ హమీద్ అన్సారీకీ సమర్పించనున్నారని సమాచారం. రాజ్యసభలో సమైక్య నినాదాన్ని వినిపించిన హరికృష్ణ, ఆ వెంటనే ఆత్మవిమర్శ పేరుతో ఓ లేఖ రాసి తన ఆవేదనను వ్యక్తం చేశారు. దాంతో, చంద్రబాబుకు, హరికృష్ణకు మధ్య విభేదాలు పొడచూపాయని వార్తలు కూడా వచ్చాయి. రాష్ట్ర విభజన విషయంలో వారిద్దరివీ భిన్న వాదనలు కావడంతో రాజీనామా చేస్తున్నారని కొందరంటుంటే, కేవలం విభజనకు వ్యతిరేకంగానే ఈ రాజీనామా అని మరోవైపు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News