: ఉల్లికి రెక్కలు.. లబోదిబోమంటున్న సామాన్యులు


ఉల్లి ఘాటెక్కింది. ఉల్లి పేరు వింటేనే కన్నీళ్లొస్తున్నాయి. ఉల్లి అరుదైన జాతుల్లో చేరిపోతుందేమో అన్నట్టుంది దీని ధర. గత రెండు నెలలుగా సామాన్యుడికి చిక్కకుండా ఆకాశానికి ఎగబాకుతున్న ఉల్లి ధర ఉన్నట్టుండి నిన్న పెరిగింది. ప్రభుత్వాలన్నీ ఉల్లి ధరను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న కొద్దీ మరీ బెట్టుచేస్తోంది. కొండెక్కిన ఉల్లి ధరల్ని నేలపైకి తీసుకొచ్చేందుకు పాకిస్థాన్, చైనా, ఈజిప్టు, ఇరాన్ దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి నాఫెడ్ ఈ రోజే గ్లోబల్ టెండర్లు పిలిచింది. ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ మహారాష్ట్రలోని లసల్ గావ్ మార్కెట్ లో హోల్ సేల్ కేజీ ఉల్లి ధర 41.25 పలికింది. దీంతో దేశవ్యాప్త నగరాల్లో నిన్నటి వరకు 40,50,60 రూపాయలు పలికిన ఉల్లిపాయల ధర తాజాగా 80కి చేరింది. ఢిల్లీలో ఇప్పుడు కేజీ ఉల్లి 80 రూపాయలు పలుకుతోంది.

  • Loading...

More Telugu News