: సమైక్యాంధ్ర సభకు అభ్యంతరం లేదు: అనురాగ్ శర్మ
సమైక్యాంధ్ర సభ అనుమతి కోసం తమను ఎవరూ సంప్రదించలేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. సభ శాంతియుతంగా నిర్వహించుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాజధాని కనుక వారికి సభను నిర్వహించుకునే హక్కు ఉందని, అయితే శాంతిభద్రతల పరిరక్షణే తమ విధి కనుక శాంతికే ప్రాధాన్యతనిస్తామని అనురాగ్ శర్మ తెలిపారు.