: మరణించి గెలిచిన దబోల్కర్
మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన డాక్టర్ నరేంద్ర దబోల్కర్ కృషి ఎట్టకేలకు ఫలించనుంది. యాంటీ బ్లాక్ మ్యాజిక్, సూపర్ స్టిషన్ ఆర్డినెన్స్ ను మహారాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. మూఢనమ్మకాల విషయంలో ప్రజలను చైతన్యవంతులను చేస్తూ, అమానవీయ ఆచారాలకు అడ్డుకట్టవేసే దిశగా ఓ పటిష్ట చట్టం తేవాలని డాక్టర్ నరేంద్ర దబోల్కర్ దశాబ్థకాలంగా పోరాడుతూ వచ్చారు. బిల్లు తేవడంలో ఆలస్యం చేసినందుకు దభొల్కర్ హత్యానంతరం నిరసన ప్రదర్శనల్లో ప్రజలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ను తీవ్రంగా విమర్శించారు. ఈ రోజు సమావేశమైన కేబినెట్ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపింది. దీంతో నరేంద్ర దబోల్కర్ మరణించి గెలిచినట్టయింది. నిన్న మార్నింగ్ వాక్ సందర్భంగా దబోల్కర్ పుణేలో హత్యకు గురైన సంగతి తెలిసిందే.