: సీబీఐ అడిగిన వాటికి వివరణ ఇచ్చాను: ధర్మాన
లేపాక్షి భూముల కేటాయింపు వ్యవహారంపై సీబీఐ పలు ప్రశ్నలు అడిగిందని మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. వాటిలో తనకు తెలిసిన వాటికి వివరణ ఇచ్చానన్నారు. వాటిని అధికారులు నోట్ చేసుకున్నారన్నారు. ఉదయం పదకొండు నుంచి సాయంత్రం నాలుగింటి వరకు మొత్తం ఐదు గంటల పాటు దిల్ కుషా అతిధి గృహంలో సీబీఐ అధికారుల విచారణ ముగిసింది. అనంతరం బయటికి వచ్చిన ధర్మాన మీడియాతో మాట్లాడారు. లేపాక్షి వ్యవహారంలో ఐఏఎస్ అధికారి శామ్యూల్ ను కూడా సీబీఐ పిలిచిందని ధర్మాన వెల్లడించారు. మరల తనను విచారణకు పిలిచే ఆలోచన లేదని సీబీఐ చెప్పినట్లు తెలిపారు.