: తప్పుచేయలేదంటున్న ఆశారామ్
లైంగిక వేధింపుల ఆరోపణలను ఆశారామ్ బాపు ఆశ్రమ వర్గాలు ఖండించాయి. ఎవరో గిట్టనివాళ్ళు చేస్తున్న అసత్య ప్రచారంగా దీన్ని కొట్టిపారేశాయి. ఢిల్లీలో ఆశారామ్ ప్రతినిధి నీలమ్ దూబే మాట్లాడుతూ, ఆయనపై ఆరోపణలన్నీ కట్టుకథలేనన్నారు. ఆయనను అప్రదిష్ఠపాల్జేసేందుకు పన్నిన కుట్రగా దీన్ని అభివర్ణించారు. దర్యాప్తు చేస్తే నిజానిజాలు వెల్లడవుతాయని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యవహారం వెనుక కొందరు వ్యక్తులున్నట్టు తమకు తెలుసునని అన్నారు. బాపు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ 15 ఏళ్ళ బాలిక ఢిల్లీ కమలా మార్కెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.