: కొండ్రు వ్యాఖ్యలపై ఎంపీ పొన్నం మండిపాటు
తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయం అంతిమం కాదన్న మంత్రి కొండ్రు మురళి వ్యాఖ్యలపై ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. పార్టీ నిర్ణయాన్ని కాదనుకున్న వారు బయటికి వెళ్లిపోవచ్చన్నారు. తీసుకున్న నిర్ణయానికే పార్టీ కట్టుబడి ఉంటుందని పొన్నం చెప్పారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటుచేసిన 'మీట్ ది ప్రెస్'లో మాట్లాడిన ఆయన పైవిధంగా మాట్లాడారు.