: దావూద్ అనుచరులకు నాన్ బెయిలబుల్ వారెంట్లు
ఐపీఎల్ ఆరవ సీజన్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నలుగురు భారత బుకీలకు ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు వీరు అనుచరులని తెలియడంతో వారెంట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ నుంచి దావూద్ భారత్ లో ఫిక్సింగ్ ను నిర్వహించేందుకు సహకరించారన్న ఆరోపణలవల్లే ఈ వారెంట్లు జారీ అయినట్లు సమాచారం. కాగా, స్పాట్ ఫిక్సింగ్ ఛార్జిషీటులో ఇప్పటికే పోలీసులు దావూద్ పేరును చేర్చిన సంగతి తెలిసిందే.