: బాబుకు రాఖీ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఆ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు, నేతలు రాఖీలు కట్టారు. నేడు రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాదు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనకు తెలుగు మహిళలు రాఖీలు కట్టి తమ అనుబంధాన్ని చాటుకున్నారు. ఎంపీ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, సీతక్క, సత్యవతి రాథోడ్, తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు శోభా హైమావతి బాబుకు రాఖీలు కట్టి ఆయన ఆశీస్సులందుకున్నారు.