: ప్రధాని పర్యటనపై టీడీపీ అధినేత అసంతృప్తి
పేలుళ్ల ఘటనలో బాధితులను పరామర్శించేందుకు రాష్ట్ర రాజధాని హైదరాబాదులో దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. దారుణమైన మారణకాండకు పాల్పడ్డ ఉగ్రవాదులకు హెచ్చరికగా మన్మోహన్ సింగ్ ప్రకటన చేయలేకపోయారని ఆయన విమర్శించారు. ప్రధాని హైదరాబాద్ పర్యటన ప్రజల్లో నమ్మకాన్ని కలిగించలేకపోయిందని చంద్రబాబు మండిపడ్డారు.