: సమైక్యంగా ఉందామంటూ రాఖీలు కట్టిన సీమాంధ్ర ఉద్యోగులు
తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల నినాదాలతో విద్యుత్ సౌధ మార్మోగిపోయింది. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పోటాపోటీ ఆందోళనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సీమాంధ్ర మహిళా ఉద్యోగులు సమైక్యంగా ఉందామంటూ తెలంగాణ ఉద్యోగులకు రాఖీలు కట్టారు. దీంతో, తెలంగాణ ఉద్యోగులకు కాసేపు ఏం చేయాలో పాలుపోలేదు. ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.