: నకిలీ కరెన్సీయా... లేదే.. ఒక్క ఫిర్యాదు కూడా లేదు: ఆర్బీఐ
నకిలీ కరెన్సీపై రాష్ట్రంలో ఒక్క ఫిర్యాదు కూడా అందలేదని బ్యాంకింగ్ అంబుడ్స్ మన్ కృష్ణమోహన్ తెలిపారు. హైదరాబాద్ లో నేడు ఆర్ బీఐ అధికారులు మాట్లాడుతూ, రాష్ట్రంలో రిజర్వ్ బ్యాంకు చర్యల వల్ల ఖాతాదారులు తృప్తిగా ఉన్నారని అన్నారు. ఫిర్యాదు చేసిన తరువాత నకిలీ కరెన్సీపై సంబంధిత బ్యాంకులు స్పందించకపోతే ఆర్ బీఐ చర్యలు తీసుకుంటుందని ఆర్ బీఐ రీజినల్ డైరెక్టర్ దాస్ స్పష్టం చేశారు.