: చైనా సైన్యం దుస్సాహసం


చైనా ఎప్పటికప్పుడు కయ్యానికి కాలుదువ్వుతోంది. చర్చలు జరిగి ఒప్పందాలు చేసుకున్నా చైనా సైన్యం భారత భూభాగంలోకి చొరబాటులను ఆపడం లేదు. గతవారం భారత భూభాగంలో అరుణాచల్ ప్రదేశ్ వద్ద 20 కిలోమీటర్ల దూరం లోపలికి చొచ్చుకువచ్చిన చైనా సైనికులు నాలుగు రోజులపాటు అక్కడే శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని ఉండిపోయారని సమాచారం. తూర్పు అరుణాచల్ ప్రదేశ్ లోని చంగ్లగం ప్రాంతంలో ఆగస్టు 13 న చైనా సేనలు చొచ్చుకుని వచ్చాయని తెలుస్తోంది. అయితే, తొలుత ఈ వార్తను కొట్టివేసిన సైన్యం తరువాత నిజమేనని అంగీకరించింది. గతంలో కూడా చైనా సైన్యం ఇలాగే వచ్చి 20 రోజులు ఉండివెళ్లిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News