: బాలయ్య కుమార్తె వివాహ వేడుకలో ప్రముఖుల సందడి
నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని వివాహ వేడుకకు ప్రముఖలు భారీగా హాజరయ్యారు. హైదరాబాదులోని హైటెక్స్ వద్ద జరుగుతున్న ఈ పరిణయ మహోత్సవానికి సినీ స్టార్లతో పాటు రాజకీయ నేతలూ తరలివచ్చారు. కేంద్ర మంత్రులు చిరంజీవి, జైపాల్ రెడ్డి, కావూరి సాంబశివరావు, బలరాం నాయక్, తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఎంపీలు నామా నాగేశ్వరరావు, రాయపాటి సాంబశివరావు, కనుమూరి బాపిరాజు, మాగుంట శ్రీనివాసులరెడ్డి, మధుయాస్కీ గౌడ్, రాష్ట్ర మంత్రి జానారెడ్డి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ, టీడీపీ నేతలు యనమల, ఎర్రబెల్లి, సుజనా చౌదరి, అంబికా కృష్ణ, దేవినేని ఉమ, కరణం బలరాం, వర్ల రామయ్య, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇక టాలీవుడ్ నుంచి దాసరి నారాయణరావు, రామానాయుడు, మురళీమోహన్, మోహన్ బాబు, పరుచూరి సోదరులు, కృష్ణ, విజయనిర్మల, జయసుధ, గోపీచంద్, బ్రహ్మానందం, కోడి రామకృష్ణ, మంచు మనోజ్, లక్ష్మీ ప్రసన్న, జగపతి బాబు తదితరులు విచ్చేశారు.