: రాష్ట్రాన్ని దోచుకునేందుకే విజయమ్మ దీక్ష: బస్వరాజు సారయ్య
రాష్ట్రాన్ని మరోసారి దోచుకునేందుకే విజయమ్మ దీక్ష చేపట్టారని మంత్రి బస్వరాజు సారయ్య ఆరోపించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యోగులపై దాడులకు దిగితే ఊరుకోబోమని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ నేతలు కొత్త నాటకాలకు తెరతీశారని ఆయన మండిపడ్డారు.