: మండుతున్న విదేశీ మద్యం ధరలు
కొందరికి విదేశీ మద్యం అంటే మోజు. సంపన్నులకు ఫారెన్ మందే స్టేటస్. రూపాయి విలువ హరించుకుపోయిన ప్రభావం ఇప్పుడు విదేశీ మద్యంపై కూడా పడింది. 30 శాతానికి పైగా ధరలు పెరిగిపోయాయి. ప్రస్తుతం అమెరికా, లాటిన్ అమెరికా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోప్ దేశాల నుంచి మద్యం దిగుమతి అవుతోంది. ఏప్రిల్ తర్వాత రూపాయి మారకం విలువ 20 శాతం వరకూ తగ్గిపోయింది. మద్యం దిగుమతికి డాలర్లలోనే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో రూపాయిలు ఎక్కవ పెడితేగానీ డాలర్లు రావడం లేదు. దీనివల్ల దిగుమతి దారులు ధరలను భారీగా పెంచేశారు.