: సీఎస్ కు సచివాలయ ఉద్యోగుల సమ్మె నోటీసు
సమైక్యాంధ్రకు మద్దతుగా సచివాలయ ఉద్యోగులు 22 వ రోజు కూడా నిరసనలు చేపట్టారు. ప్రజాప్రయోజనాలను పక్కనబెట్టి రాజకీయ లబ్ది కోసం నిర్ణయాలు తీసుకోవడం దేశప్రగతికి మంచి చేయదని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే భవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతుందని నినాదాలు చేస్తున్నారు. దీంతో సమైక్యాంధ్రకు మద్దతుగా చీఫ్ సెక్రటరీకి సచివాలయ ఉద్యోగులు మరికాసేపట్లో సమ్మె నోటీసివ్వనున్నారు. వీరు సెప్టెంబర్ 2 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు.