: 'సోషల్ మీడియా' ఒక్కటే ఎన్నికల విజయానికి తోడ్పడదు: శశిథరూర్
ఎన్నికల్లో విజయం సాధించడానికి ఏ ఒక్క రాజకీయ పార్టీకి 'సోషల్ మీడియా' ఒక్కటే సాయపడలేదని కేంద్ర మంత్రి శశిథరూర్ అన్నారు. అయితే, ప్రజలను చేరటానికి ఇదొక కొత్త మార్గమని పేర్కొన్నారు. ఢిల్లీలో ఓ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈ విధంగా మాట్లాడారు. భారతదేశంలో దాదాపు 10 నుంచి 12 శాతం ప్రజలు ఇంటర్నెట్ ను కలిగిఉంటే, 70 శాతం మంది మొబైల్ నెట్ ను కలిగి ఉన్నారన్నారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా చైతన్యవంతమైన పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.