: ఢిల్లీలోని ఇండియాగేట్ పరిసరాల్లో సోదాలు


హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల ఘటన నేపథ్యంలో దేశ రాజధానిలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఇండియా గేట్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికారులు..అక్కడున్న ప్రజలను దూరంగా పంపుతున్నారు. ఇండియా గేట్ చుట్టుపక్కల పచ్చిక బయళ్లను, రోడ్లను అధికారులు అణువణువు పరిశీలిస్తున్నారు. అయితే ట్రాఫిక్ కు మాత్రం ఎటువంటి అంతరాయం లేకుండా భద్రతాధికారులు చర్యలు తీసుకున్నారు.

  • Loading...

More Telugu News