: ఆశిష్ ను అరెస్ట్ చేయొద్దు: సుప్రీంకోర్టు
దళితులపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో రచయిత ఆశిష్ నంది ని అరెస్ట్ చేయరాదని
సుప్రీం కోర్టు రాజస్థాన్ పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో ఆశిష్
ను ప్రశ్నించడానికి మాత్రం అనుమతించింది. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఆశిష్ దాఖలు చేసుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది.
ఆశిష్ మీద నమోదైన ఎఫ్ఐఆర్ లు కొట్టివేసే విషయంలో స్పందన తెలియచేయాలని కోరుతూ రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్ రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. భవిష్యత్తులో వివాదాస్పద వ్యాఖ్యలు చేయరాదంటూ ఆశిష్ నంది ని సుప్రీం కోర్టు హెచ్చరించింది. ఉద్దేశ్యం ఏదైనా ఇటువంటి వ్యాఖ్యలు సరికాదని సూచించింది.