: సైకిల్ పై బహ్రెయిన్ చేరుకున్న భారతీయుడు
ప్రమాదరకమైన ఎయిడ్స్ పై అవగాహన కల్పించే లక్ష్యంతో సైకిల్ పై ప్రపంచయాత్రకు బయల్దేరిన భారతీయుడు సోమన్ దేబ్ నాథ్ బహ్రెయిన్ చేరుకున్నాడు. మనామాలో రెండు వారాల పాటు అతడు వర్క్ షాపుల ద్వారా స్థానికులకు ఎయిడ్స్ పై బోధనలు చేయనున్నాడు. 2004లో కోల్ కతాలో ఇతడు సైకిల్ యాత్ర ప్రారంభించాడు. 2020 నాటికి 191 దేశాలను ఇతడు చుట్టి రావాలనుకున్నాడు. బహ్రెయిన్ తో 80 దేశాల్లో పర్యటన పూర్తయింది.