: నిజామాబాద్ లో లక్షాపాతిక శివలింగార్చన


నిజామాబాద్ లో లక్షాపాతిక శివలింగార్చన పూజలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గోశాలలో లక్ష్మీనారాయణ మందిరం పూజారి గోపాల్ దాస్ ఆధ్వర్యంలో నెలరోజులపాటు గోదావరి మట్టితో తయారు చేసిన లింగాలను రోజుకో ఆకారంలో పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరి రోజున అర్థనారీశ్వరి ఆకారంలో లింగాలను ఏర్పాటు చేసి రుద్రాభిషేకం, అర్చన, అభిషేకాలు చేశారు. ఈ పూజల్లో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News