: సుప్రీం కోర్టులో హాజరైన రతన్ టాటా


టాటా గ్రూపు మాజీ చైర్మన్ రతన్ టాటా ఈ రోజు సుప్రీం కోర్టు ముందుకు వచ్చారు. కార్పొరేట్ లీడర్లు, రాజకీయ నేతలు ఇతర ప్రముఖులతో కార్పొరేట్ లాబీయిస్టు నీరా రాడియా సంభాషణలు నడిపిన సంగతి తెలిసిందే. నీరా.. రతన్ టాటాతోనూ సంభాషించారు. అయితే, వీటిని బయటపెట్టిన వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ రతన్ టాటా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇలా చేయడం తన వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత హక్కుకు భంగం కలిగించడమేనని అందులో పేర్కొన్నారు. దీనిని కోర్టు విచారిస్తోంది.

  • Loading...

More Telugu News