: సోనియా నియోజకవర్గంలో విమానయాన, మహిళా వర్శిటీలు
యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో రాజీవ్ గాంధీ జాతీయ విమానయాన విశ్వవిద్యాలయం, జాతీయ మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. దాంతో, దేశంలోనే తొలిసారి ఈ రెండు వర్శటీలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు నిన్న పార్లమెంటు సమావేశాల్లో వీటి బిల్లును కేంద్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. వీటితోపాటు విమానయాన అధికార సంస్థ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును కూడా ప్రవేశపెట్టారు. 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో రూ.500 కోట్ల ఖర్చుతో మహిళా వర్శిటీని నిర్మించనున్నారు.