: ఓటేయలేదని 5 కుటుంబాల వెలి


గ్రామాల్లో రాజకీయ పార్టీల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి వర్గాలుగా విడిపోయే గ్రామాల్లో అధికారపార్టీ వర్గం చెలరేగిపోతుంటుంది. తాజాగా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడికి ఓటేయలేదని 5 కుటుంబాలను వెలివేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం అల్లూరు శివారు రెడ్డిపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ గ్రామంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలిచినప్పటికీ గ్రామపెద్దలు కాంగ్రెస్ మద్దతు దారులు కావడంతో వేధిస్తున్నారని, ఊర్లోని వారు తమతో మాట్లాడకూడదని ఆంక్షలు విధించారని, గ్రామం విడిచి వెళ్లాలంటూ బెదిరిస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్ సురేష్ కుమార్, ఆర్డీఓ, డీఎస్పీ లకు ఆ ఐదు కుటుంబాల వారు లేఖలు రాశారు.

  • Loading...

More Telugu News