: అతడిని ఎత్తాలంటే క్రేన్ కావాలి సుమా!
అతడి వయసు 20 ఏళ్లు. బరువు 50 కేజీలనుకుంటున్నారా, కానేకాదు. మరి 100 కేజీలా..!? కాదండీ బాబూ! అక్షరాలా ఆరు వందల పది కేజీలు. ఉండేది సౌదీ అరేబియాలో. మార్బిడ్ ఒబెసిటీ అనే సమస్య కారణంగా ఇతడి బరువు ఈ స్థాయికి చేరింది. రెండున్నరేళ్ల పాటు బెడ్ కే పరిమితమైన ఖాలిద్ మొహిసిన్ మొత్తానికి క్రేన్ సాయంతో అంబులెన్స్ ఎక్కి రియాద్ లోని కింగ్ ఫహిద్ మెడికల్ సిటీ ఆసుపత్రిలో పరీక్షలకు వెళ్లాడు. సౌదీ రాజు అబ్దుల్లా ఆరు నెలల క్రితమే ఈ భారీ కాయుడిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. కానీ, ఇతడి బరువును మోసే, ఇతడు పట్టే బెడ్ ఆస్పత్రిలో లేదు. అమెరికాలో ప్రత్యేకంగా తయారు చేయించి తెప్పించారు. అందుకే ఇన్ని నెలలు ఆలస్యం అయిందట.