: ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర దీక్ష భగ్నం
సమైక్యాంధ్రకు మద్దతుగా గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చేపట్టిన నిరవధిక దీక్షను మంగళవారం అర్థరాత్రి పోలీసులు భగ్నం చేశారు. దీక్షను భగ్నం చేసేందుకు వచ్చిన పోలీసులను టీడీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో అక్కడ కాసేపు తోపులాట చోటుచేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో కార్యకర్తలను చెదరగొట్టి ఎమ్మెల్యే నరేంద్రను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ ధూళిపాళ్ల నరేంద్ర గత నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.