: పాములతో వినూత్న 'సమైక్య' నిరసన
సమైక్యాంధ్రకు మద్దతుగా సమైక్యవాదులు వినూత్నంగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. విశాఖలోని గాజువాక కూడలిలో స్నేక్ కిరణ్ పాములతో నిరసన వ్యక్తం చేశాడు. రాష్ట్రం విడిపోకూడదని, సోనియాగాంధీ మనసు మారాలని కోరుతూ సమైక్యాంధ్ర మద్దతుదారులు పూజలు నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ర్యాలీలు, మానవహారాలతో సమైక్యవాదులు కదం తొక్కుతున్నారు.