: తాతయ్యలకు ఈ చిట్టి తోడుంటాడు
వయసు పెరిగిన తర్వాత ఎవరో ఒకరు తోడు ఉండాలి. ఎందుకంటే, ఆ వయసులో మతిమరుపు రావడం సహజం. దీంతో వేళకు మందులు వేసుకోవడం వంటివి ఎవరో ఒకరు గుర్తుచేయాల్సి ఉంటుంది. ఇలాంటి పనులను గుర్తుచేయడానికి శాస్త్రవేత్తలు ఒక కొత్తరోబోను రూపొందించారు. ఈ రోబో సమయానికి భోజనం చేయడం దగ్గరినుండి వ్యాయామం చేయడం, మందులు వేసుకోవడం వంటి పనులన్నింటినీ వేళకు గుర్తుచేస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు.
ఐరోపాలోని పలు పరిశోధనా సంస్థలు, కంపెనీలు కలిసి నాలుగేళ్లపాటు శ్రమించి ఒక రోబోను రూపొందించారు. ఈ రోబోపేరు మొబిసెర్వ్. ఈ రోబో ఎవరినైతే సూచించారో వారికి సంబంధించి వారు వేళకు భోజనం చేయడం, వ్యాయామం చేయడం, మందులు వేసుకోవడం వంటి అన్ని పనులను ఇది గుర్తు చేస్తుందట. వారు ఆ పనులను చేయకుంటే దగ్గరికి వెళ్లి వాటిని చేయమని చెబుతుందట. అంతేకాదు ఎలా చేయాలో కూడా స్క్రీన్‌పై అది చూపెడుతుందట. ఒకటి రెండేళ్లలో ఈ రోబోను అందరికీ అందుబాటులోకి తేనున్నారు.