: చెలరేగితే చూస్తూ ఊరుకోం: అనురాగ్ శర్మ


హైదరాబాదులోని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణవాదులైనా, సమైక్యవాదులైనా శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. ఈ ఆందోళనల్లో బయటి వ్యక్తులు పాల్గొని, రెచ్చగొట్టి, ఘర్షణ వాతావరణం ఏర్పడితే తాము చూస్తూ ఊరుకోమని, జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఏ ప్రాంతంవారైనా సరే సంయమనం పాటిస్తే ఇబ్బందులు ఉండవని ఆందోళనకారులకు అనురాగ్ శర్మ సూచించారు.

  • Loading...

More Telugu News