: వచ్చే ఎన్నికల్లో పొత్తులుండవ్: కిషన్ రెడ్డి
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులుండవని సూచనప్రాయంగా వెల్లడించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ, 2014 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీచేస్తామని చెప్పారు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 11 వరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తానని ఆయన తెలిపారు. సెప్టెంబర్ చివర్లో మహబూబ్ నగర్ లో భారీస్థాయిలో ప్రజాగర్జన సభ ఉంటుందని అన్నారు. కాగా, కొద్దిరోజుల క్రితం బీజేపీ పొత్తు ఉండొచ్చని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పిన నేపథ్యంలో, కిషన్ రెడ్డి తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.