: అవనిగడ్డ ఉపఎన్నిక పోలింగ్ రేపే
టీడీపీ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య మరణించడంతో ఖాళీ అయిన కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ స్థానంలో రేపు ఉప ఎన్నిక జరగనుంది. పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలుగుదేశం పార్టీ తన తరుపున బ్రాహ్మణయ్య కుమారుడు శ్రీహరిని బరిలో దింపగా.. ప్రధాన పార్టీలేవీ తమ అభ్యర్థులను ప్రకటించకుండా సంప్రదాయాన్ని పాటించాయి. అయితే, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉండడంతో పోలింగ్ అనివార్యమైంది. కాగా, అవనిగడ్డ స్థానంలో ఏకగ్రీవం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్ని పార్టీలకు లేఖ రాశారు. చివరికి వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించే లోక్ సత్తా పార్టీ కూడా బాబు విజ్ఞప్తిని మన్నించి అభ్యర్థిని పోటీకి నిలపలేదు.