: బంజారాహిల్స్ పీఎస్ లో హాజరైన 'లవ్ ఎటాక్' హీరోయిన్
కొన్ని రోజుల కిందట అదృశ్యమై నిన్న మీడియా ముందుకు వచ్చిన వర్ధమాన నటి, 'లవ్ ఎటాక్' హీరోయిన్ సాయి శిరీష బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు హాజరైంది. సవతి తండ్రి ఆగడాల వల్లే తాను బయటికి వచ్చానని చెప్పింది. తాను మేజర్ ను కాదని తల్లి చేసిన ఆరోపణల్లో నిజం లేదంటోంది. తాను రోడ్డున పడలేదన్న శిరీష, తల్లిదండ్రుల వల్లే రోడ్డెక్కాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటినుంచి బయటికి వచ్చేముందు అన్ని విషయాలను లెటర్ రాసినా, తల్లి రాయలేదని చెప్పి అన్నీ దాచిందని చెప్పింది. తాను మైనర్ ను కాదని, ఇష్టం లేకుండా అక్కడ ఉండలేనంటోంది. ఇన్నిరోజులు హైదరాబాదులోనే తన స్నేహితురాలు ఉంటున్న హాస్టల్లో ఉన్నానని, ఆమే తనకు అన్ని ఖర్చులు భరిస్తోందని వివరించింది. ఇకనుంచి సొంతకాళ్లపై నిలిచి జీవితం గడుపుతానని శిరీష తెలిపింది.